జనవరి 1 నుండి పెరగనున్న బీమా ప్రీమియంలు..!!
- December 29, 2024
దుబాయ్: హెల్త్‌కేర్, వాహన మరమ్మతు ఖర్చులలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా బీమా సంస్థలు రేట్లు పెంచనున్నాయి. జనవరి 1 నుండి దుబాయ్‌లో హెల్త్, మోటారు బీమా ప్రీమియంలు పెరుగుతాయి. మోటార్ సెగ్మెంట్‌తో పోలిస్తే ఆరోగ్య బీమా ప్రీమియంలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రీమియంల పెంపు వల్ల ఎమిరేట్ వాసులకు కొన్ని ప్రయోజనాలు కూడా వస్తాయని వారు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా యూఏఈలో ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గ్లోబల్ రేట్ల కంటే తక్కువగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా 5-6 శాతంతో పోలిస్తే, యూఏఈలో కేవలం రెండు శాతం మాత్రమే ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
కొత్త దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ) సర్క్యులర్ ప్రకారం.. ఆరోగ్య బీమా ప్రీమియంలు, ప్రయోజనాల నాణ్యత జనవరి 1నుండి మరింత మెరుగుపడుతుందని ఏఈ హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ తెలిపారు. హెల్త్ ప్లాన్‌లలో చేర్చబడిన అదనపు ప్రయోజనాలపై ఆధారపడి ప్రీమియంలు ఐదు శాతం నుండి 20 శాతం వరకు పెరుగుతాయని చౌహాన్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







