మహిళ కారుపై ' అభ్యంతరకరమైన' నోట్‌..యువకుడికి 1,000 దిర్హామ్‌ల జరిమానా..!!

- December 29, 2024 , by Maagulf
మహిళ కారుపై \' అభ్యంతరకరమైన\' నోట్‌..యువకుడికి 1,000 దిర్హామ్‌ల జరిమానా..!!

యూఏఈ: పబ్లిక్ డీసెన్సీ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత 19 ఏళ్ల ఎమిరాటికి 1,000 దిర్హామ్‌ల జరిమానా విధించారు. పోర్ట్ రషీద్ ప్రాంతంలోని కేఫ్ సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ స్థలంలో జరిగిన ఈ సంఘటనలో యువకుడు ఒక మహిళ కారుపై అభ్యంతరకరమైన చేతిరాతతో రాసిన నోట్‌ను పెట్టాడు. అందులో అభ్యంతరకరమై, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నవంబర్ 10, 2023న జరిగింది.  నోట్‌ను గుర్తించిన వెంటనే, భర్త దానిని ఫోటో తీసి తన భార్యకు పంపాడు. ఆమె వెంటనే సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీని పరిశీలించి యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు కారు ఓనర్ ఎవరో తెలియదని, ఆమెతో ఎలాంటి ముందస్తు పరిచయం లేదని, సరదాగా రాసినట్లు విచారణలో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com