ఘోర విమానం ప్రమాదం..179 మంది దుర్మరణం..
- December 29, 2024
కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం మరవకముందే సౌత్ కొరియాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. 181 మందితో ప్రయాణిస్తున్న విమానం ఆదివారం ఉదయం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి కంచెలోకి దూసుకెళ్లింది. ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా.. రన్ వేను రాసుకుంటూ వెళ్లిన ఫ్లైట్ నేరుగా గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 179 మంది మరణించినట్లు స్థానిక అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ప్రమాద స్థలం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించినట్లు తెలిపింది. బ్యాంకాక్ నుంచి జెజు ఎయిర్ ఫ్లైట్ 7C 2216 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వస్తున్న క్రమంలో మువాన్ కౌంటీలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాద లైవ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షాక్‌కు గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా ఫ్లైట్ పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అర్పించేందుకు ప్రయత్నించాయి. విమానం భాగాలు కొన్ని రన్‌వేపైనా.. నేలపై పడి ఉన్నాయి. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్-మోక్ ఈ ప్రమాదంపై స్పందించారు. అంతర్గత, భద్రతా మంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేారు. అందుబాటులో ఉన్న అన్ని పరికరాలు, సిబ్బందిని సమీకరించి.. సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది కొరియన్లు, వారిలో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రమాద స్థలం నుంచి ఒక ప్రయాణికుడు, ఒక సిబ్బందిని అత్యవసర సిబ్బంది రక్షించారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు 32 అగ్నిమాపక వాహనాలు, పలు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వైరల్ అవుతున్న ఫుటేజీలో జెజు ఎయిర్ విమానం ఎయిర్పోర్ట్ అంచున ఉన్న కాంక్రీట్ గోడపై ఢీకొనడానికి ముందు.. ల్యాండింగ్ గేర్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌స్ట్రిప్ మీదుగా స్కిడ్ చేస్తున్నట్లు చూపించింది.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







