ఖతార్ ఎనిమిది నెలల్లో 13.7% పెరిగిన కొత్త వాహనాలు..!!
- December 30, 2024
దోహా: 2024లో ఖతార్ కొత్త వాహనాల అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో మొత్తం 62,163 కొత్త వాహనాలు నమోదయ్యాయి. అదే 2023లో నమోదైన 54,656 వాహనాలతో పోలిస్తే ఇది 13.7% పెరిగింది. జాతీయ ప్రణాళికా మండలి విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన అన్ని కొత్త వాహనాల్లో 70 శాతానికి పైగా ప్రైవేట్ వాహనాలే ఉన్నాయి.
ఆగస్టు నెలలో మొత్తం 8,605 కొత్త వాహనాలు నమోదు కాగా, ఇది ఇప్పటివరకు సంవత్సరంలో రెండవ అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. మేలో 8,903 కొత్త వాహనాలు, జనవరిలో 8,512, మార్చిలో 7,835, జూలైలో 7,733, ఫిబ్రవరిలో 7,231, ఏప్రిల్లో 7011, జూన్ 2024లో 6,333 కొత్త వాహనాలు నమోదయ్యాయి.
నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ ప్రకారం.. ఆగస్టు 2024 చివరి నాటికి ఖతార్ మొత్తం జనాభా 3.054 మిలియన్లకు చేరుకుంది. గత 16 సంవత్సరాల్లో దేశ జనాభా రెట్టింపు అయ్యింది. అక్టోబర్ 2008 చివరి నాటికి 1.54 మిలియన్లుగా ఉన్నది. ఈ సంవత్సరం ఖతార్ GDP వృద్ధి అంచనా 2.2 శాతంగా ఉంది. 2025లో 2.9 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







