మస్కట్ ఫ్లవర్ ఫెస్టివల్లో రాయల్ కోర్ట్.. గులాబీల అద్భుత సేకరణలు..!!
- December 30, 2024
మస్కట్: రాయల్ ఫార్మ్స్ అండ్ గార్డెన్స్, రాయల్ హాస్పిటాలిటీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ కోర్ట్ అఫైర్స్.. మస్కట్ నైట్స్ 2024 కార్యక్రమాలలో భాగంగా మస్కట్ ఫ్లవర్ ఫెస్టివల్లో ప్రకృతి సౌందర్యాన్ని, ఒమానీ సృజనాత్మకతను ప్రతిబింబించే ప్రత్యేకమైన, విభిన్న ప్రదర్శనలతో పాల్గొంటుంది. ఇక్కడ వినూత్నంగా తయారుచేసిన సహజ-కృత్రిమ గులాబీల అద్భుతమైన సేకరణను ప్రదర్శించారు.
ఖురమ్ నేచురల్ పార్క్‌లో జరిగే ఫెస్టివల్లో ఒమన్‌లో పెరిగే ట్యూబ్ రోజ్, ఆర్కిడ్లు వంటి స్థానికంగా పెరిగిన పువ్వులను ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ గులాబీలు, పువ్వుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సువాసనగల ఓహార గులాబీ, లిల్లీ పువ్వులు, క్రిసాన్తిమం కొమ్మలు, హైడ్రేంజ, ఆంథూరియం, మాటియోలా, హెలికోనియా వంటి విలక్షణమైన కట్ పువ్వులు అలరించనున్నాయి. మస్కట్ ఫ్లవర్ ఫెస్టివల్లో ఒమానీ ఉనికిని పెంపొందించడానికి వీలుగా నెదర్లాండ్స్, థాయిలాండ్, ఆఫ్రికా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ దేశాల నుండి అత్యుత్తమ రకాల గులాబీలను దిగుమతి చేసుకుంటుందని, ఇది సందర్శకుల అనుభవాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







