డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డకున్న కస్టమ్ అథారిటీ..!!
- January 04, 2025
రియాద్: జకాత్, ట్యాక్స్, కస్టమ్స్ అథారిటీ (ZATCA) కింగ్ ఫహద్ కాజ్‌వే, అల్-హదితా సరిహద్దు క్రాసింగ్, దుబా పోర్ట్ వద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకుంది. వాహనాలు, ప్రయాణీకుల సామానులో దాచిన 220,000 నిషేధిత మాత్రలను స్వాధీనం చేసుకుంది. కింగ్ ఫహద్ కాజ్‌వే వద్ద మొదటి ఆపరేషన్‌లో కస్టమ్స్ అధికారులు 120,370 క్యాప్టాగన్ మాత్రలు, 45,975 ఇతర నిషేధిత మాత్రలను వాహనం నాలుగు డోర్ల కావిటీస్‌లో గుర్తించారు.
అల్-హదితా సరిహద్దు దాటే రెండవ ప్రయత్నంలో ప్రయాణీకుల దుస్తుల బ్యాగ్‌లో దాచిన 21,011 క్యాప్‌గాన్ మాత్రలు ఉన్నాయి. దుబా పోర్ట్‌లో జరిగిన మూడవ సంఘటనలో సౌదీ అరేబియాకు చేరుకున్న ట్రక్కు డ్రైవర్ సీటు కింద 34,084 క్యాప్‌టాగన్ మాత్రలను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌ను నిరోధించడానికి, సమాజాన్ని రక్షించడానికి సౌదీ దిగుమతులు, ఎగుమతులపై కఠినమైన కస్టమ్స్ పర్యవేక్షణ కొనసాగుతుందని కస్టమ్ అథారిటీ స్పష్టం చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం ద్వారా స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా పోరాటానికి సహకరించాలని పౌరులను, నివాసితులను అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







