'మా నాన్నకు ధైర్యమెక్కువే'
- January 06, 2025
ఎంత చదివినా ఎన్నటికి అర్ధం కాని మనస్థత్వం ఎదురుగా వున్న కానరాదు నీ అంతరంగం ఎన్నో బాధ్యతలు ధారవోసే జీవితంలో సర్వస్వము ఎదమాటున దిగులుని కానరానియ్యని ధీరత్వము ఎదుగుతున్న బిడ్డకి అర్ధం కాదు నీ గుండెలోని ఆంతర్యం ..
చేయిపట్టి నడిపిస్తూ అడుగడుకి చుట్టేవు శ్రీకారము
చేసే ప్రతి పోరాటంలో నా అనుకొనే ఔన్నత్యము
చేరదీసేవేళ చూపే ప్రేమ దండనవేళ ఉరిమే మేఘము
చెప్పులరిగినా లెక్కచేయక కూడబలుక్కొనే సహనము
చెరువుని తలపించేలా ఎదలో ఉబికే కన్నీటి ఉధృతము
చెప్పే మాట కరకు మనసు చూస్తే మణి ద్వీపము..
కన్న బంధం ఆలిబంధంకై తపించే యోధుడు
గారాల కూతురికి కథానాయకుడు
కొడుకుకి మాత్రము ప్రతినాయకుడిగా
నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనము
ప్రగతికి సోపానం జీవనాన్ని దిశానిర్దేశం చేసే
దిక్సూచిలా సుడిగుండాలు ఎన్ని చుట్టు ముట్టిన
ఏ మాత్రము తొణకక గుండెల మీద మోస్తూ...
మా గుండె నిండుగా నీ జ్ఞాపకాలు
మిగిల్చి ఎంతో గారాబంగా పెంచి
మా గుండెని గాయం చేసి
నీవు వెళ్ళిపోయావు నాన్న
మా నాన్నకు ధైర్యమెక్కువే ఇక మాకు ఎన్నటికి కనిపించవు..
--యామిని కోళ్ళూరు(అబుదాభి)
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







