జనవరి 9 నుంచి హనీ ఫెస్టివల్ ప్రారంభం..!!
- January 07, 2025
దోహా: జనవరి 9, 2025న ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్లో హనీ ఫెస్టివల్ ను ప్రారంభించనున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పది రోజుల పాటు జరిగే ఫెస్టివల్ ను హస్సద్ ఫుడ్ కంపెనీ సహకారంతో ఉమ్ సలాల్ వింటర్ ఫెస్టివల్ కార్యకలాపాలలో భాగంగా వ్యవసాయ వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. హనీ ఫెస్టివల్ జనవరి 18 వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడం, హనీ ఉత్పత్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్ సలాల్ వింటర్ ఫెస్టివల్ ఫిబ్రవరి 19 వరకు స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం కోసం అనేక ముఖ్యమైన ఈవెంట్లు, ప్రదర్శనలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







