సౌదీకి భారీ వర్ష సూచన..సంసిద్ధంగా మక్కా రెడ్ క్రెసెంట్..!!

- January 08, 2025 , by Maagulf
సౌదీకి భారీ వర్ష సూచన..సంసిద్ధంగా మక్కా రెడ్ క్రెసెంట్..!!

జెడ్డా: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ జారీ చేసిన భారీ వర్షపు హెచ్చరికలకు ప్రతిస్పందనగా సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) మక్కా రీజియన్ శాఖ తన సంసిద్ధత స్థాయిని పెంచింది. అధికార యంత్రాంగం తన కమాండ్, కంట్రోల్ రూమ్, అంబులెన్స్ స్టేషన్లు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, వాలంటీర్ అంబులెన్స్ యూనిట్ల పూర్తి కార్యాచరణ సంసిద్ధతను వెల్లడించింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, అంబులెన్స్ సేవలకు అంతరాయం లేదని స్పష్టం చేశారు. SRCA ప్రకారం.. మక్కా ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షణకు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్లు, నిపుణులతో సహా అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల బృందాలు దాని 98 కేంద్రాలలో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధునాతన అంబులెన్స్‌లు, విపత్తు ప్రతిస్పందన వాహనాలు, క్లిష్ట పరిస్థితుల కోసం ఎయిర్ అంబులెన్స్‌తో సహా 149 వాహనాలతోపాటు మొత్తం 1,420 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

పౌరులు, వాసితులు సంబంధిత అధికారుల సూచనలకు కట్టుబడి ఉండాలని, భారీ వర్షాల సమయంలో రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, జాగ్రత్తగా ఉండాలని కోరింది. అంబులెన్స్ బృందాలు అవసరమైన వారిని చేరుకోవడానికి మార్గాన్ని క్లియర్ చేయడానికి సహకరించాలని కోరారు.  ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 997కి కాల్ చేయడం ద్వారా లేదా "Asefne" యాప్ ద్వారా అంబులెన్స్ సేవలను పొందాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com