జనవరి 12న దుబాయ్ మారథాన్: రూట్, ట్రాఫిక్ ఆంక్షల వివరాలు..!!

- January 11, 2025 , by Maagulf
జనవరి 12న దుబాయ్ మారథాన్: రూట్, ట్రాఫిక్ ఆంక్షల వివరాలు..!!

యూఏఈ: దుబాయ్ మారథాన్ రూట్, ట్రాఫిక్ ఆంక్షల వివరాలను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ప్రయాణాల సందర్భంగా అవాంతరాలను అధిగమించేందుకు.. ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అథారిటీ కోరింది.

మారథాన్ జనవరి 12 ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది.  దుబాయ్ పోలీస్ అకాడమీ వెనుక ఉన్న మదీనాత్ జుమేరా నుండి మారథన్ ప్రారంభమవుతుంది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ స్ట్రీట్‌లో గుండా సాగుతూ.. మీడియా సిటీ తర్వాత అదే రహదారిపై మలుపు తిరుగుతుంది. మారథానర్లు షార్జా వైపు వెళ్లే రహదారిపై కొనసాగుతారు. మారథానర్‌లు జుమేరా వీధి, జుమేరా బీచ్ హోటల్‌ను దాటి అల్ మెహెమల్ స్ట్రీట్‌ క్రాసింగ్ నుండి వెనుకకు తిరుగుతారు. మారథాన్ ప్రారంభ స్థానానికి చేరుకోగానే మారథన్ ముగుస్తుంది.

ట్రాఫిక్ ఆంక్షలు

ఉమ్ సుఖీమ్ స్ట్రీట్, జుమేరా వీధి, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ స్ట్రీట్, అల్ నసీమ్ స్ట్రీట్, ఉమ్ సుఖీమ్ స్ట్రీట్‌లోని ఒక విభాగం (అల్ వాస్ల్ రోడ్, జుమేరా రోడ్ మధ్య భాగం) ముందురోజు అర్ధరాత్రి నుండి మూసివేయబడుతుంది.

జుమేరా స్ట్రీట్, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ స్ట్రీట్‌కి ఇరువైపులా నిర్దేశించిన క్రాసింగ్ ప్రాంతాలతో రేసు సాగినంత సమయం ట్రాఫిక్ ను నిలిపివేస్తారు.  ఎలైట్ అథ్లెట్లు పాస్ అయిన తర్వాత రెండు వీధుల వెంట ఒక లేన్ లో ట్రాఫిక్ ను అనుమతిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com