పార్కింగ్ లాట్స్ నుంచి సోలార్ ఎనర్జీ
- June 29, 2016
సుల్తాన్ కుబూస్ యూనివర్సిటీ (ఎస్క్యుయు), 675 ఫొటోవాల్టిక్ ప్యానెల్స్‌ని ఇన్స్టాల్ చేయాలనుకుంటోందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ అబ్దుల్లా హమాద్ అల్ బాది చెప్పారు. ఇందుకోసం 216,000 ఒమన్ రియాల్స్ ఖర్చు చేయనున్నారు. పర్యావరణ హితమైన ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలోచనను అమల్లోకి తీసుకువస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, సోలార్ ప్యానెల్స్‌ని రూఫ్ టాప్‌పై ఏర్పాటు చేయడం కన్నా, పార్కింగ్ లాట్స్‌లో ఏర్పాటు చేయడం ఉత్తమమని నిరూపించడంతో ఆ దిశగా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. సూర్యకాంతిని ఫోటోవాల్టిక్ ప్యానెల్స్ స్వీకరించి, ఆ కిరణాల్ని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చుతాయి. భౌగోళికంగా ఒమన్‌కి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో జులైలో 5,500 నుంచి 6,000 కిలోవాట్స్ శక్తిని, అలాగే జనవరిలో 2,500-3000 కిలోవాట్స్ శక్తిని చదరపు మీటర్‌కి తయారుచేయగలవని ఆయన చెప్పారు. ఏడాదిలో 340 రోజులపాటు సూర్యకాంతి అందుబాటులో ఉంటుంది ఒమన్‌లో. యూనివర్సిటీ, అంతర్జాతీయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌తో కలిసి చేసిన ప్రయోగాల్ని ఒమన్ కోసం వినియోగిస్తున్నామని డాక్టర్ బాది చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







