దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం

- January 18, 2025 , by Maagulf
దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం

దుబాయ్: ‘హిందూ మందిర్ దుబాయ్’కి ఇంటర్ టెక్ ISO సర్టిఫికేషన్‌ వచ్చింది. ఈ సర్టిఫికేషన్ లో ISO 9001 (క్వాలిటీ మేనేజ్‌మెంట్), ISO 14001 (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్), ISO 45001 (హెల్త్, సేఫ్టీ), ISO 22000 & HACCP (ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్) ఉన్నాయి జనవరి 17టెంపుల్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన అవార్డు వేడుకలో ఇంటర్‌టెక్ అధికారికంగా ISO సర్టిఫికేషన్‌ ను టెంపుల్ అధికారులకు అందజేశారు.అసాధారణమైన నాయకత్వం, శిక్షణ పొందిన ఉద్యోగులు, బలమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియలతో సహా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ,  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి టెంపుల్ సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు.  హిందూ టెంపుల్ దుబాయ్ ప్రతిష్టాత్మకమైన ప్రమాణాలను సాధించిందని ఇంటర్‌టెక్‌లో రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవెన్ ఓవెన్ అన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాజు ష్రాఫ్,  జనరల్ మేనేజర్ N. మోహన్ ఇంటర్‌టెక్‌కి కృతజ్ఞతలు తెలిపారు.  

హిందూ మందిర్ దుబాయ్ 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అరబిక్, హిందూ నిర్మాణ శైలులతో నిర్మించారు. ఈ ఆలయం పూజా స్థలంగా, సాంస్కృతిక కేంద్రంగా, ఆతిథ్యం ఇస్తుంది. కమ్యూనిటీ ఈవెంట్స్, వివాహాల కోసం మత నేపథ్యాల ప్రజలకు తెరిచి ఉందని, ఇది ప్రజాదరణ పొందిందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో మత సామరస్యం, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి పొందింది. అక్టోబర్‌లో అధికారికంగా ప్రారంభించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com