రసరాగవాహిని ఆధ్వర్యంలో ఘనంగా సంగీత విభావరి
- January 19, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై రసరాగవాహిని నిర్వహణలో హిందీ తెలుగు సినిమా పాటల గాన విభావరి ఘనంగా జరిగింది.సుమారు ముఫ్పై మంది గాయనీ గాయకులు పలు పాటలను మధుర సుధా రస భరితంగా గానం చేశారు.యుగంధర్, శ్రీనివాస్ మూర్తి, చిదంబర శాస్త్రి, దక్షిణా మూర్తి, రామమూర్తి, కామేశ్వరి, కనక దుర్గ, భార్గవి, లక్ష్మి తదితరులు గాన విభావరి లో పాలు పంచుకున్నారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీ రామరాజు మాట్లాడుతూ... సంగీతం సర్వ మానసిక రోగ నివారిణి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు. టివీలో సీరియల్స్ వల్ల ఉపయోగం ఉండదు అనీ మంచి పాటలు ఉత్సాహం ఉల్లాసం కలిగిస్తాయని చెప్పారు.వయోధికులు సైతం ఆసక్తి తో పాటలు పాడి ఆకట్టుకున్నారని అభినందించారు. సంస్థ వ్యవస్థాపకుడు పొన్నపల్లి రవి శంకర్ స్వాగతం పలుకుతూ రెండు తెలుగు రాష్ట్రాలు చెందిన గాయనీ గాయకులుతో పాటు అమెరికా నుంచి కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారని తెలిపారు.పోన్నపల్లి కామేశ్వరి కార్యక్రమ పర్యవేక్షణ చేశారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







