యూఏఈ కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా?

- January 20, 2025 , by Maagulf
యూఏఈ కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా?

యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్ అయిన లింక్డ్‌ఇన్ చేసిన ఒక కొత్త అధ్యయనం.. యూఏఈలో ఇతర దేశాలతో పాటు జాబ్ మార్కెట్‌పై కొత్త సమాచారాన్ని అందించింది.  ముఖ్యంగా రిక్రూటర్‌లు భర్తీ చేయాలనుకుంటున్న మొదటి మూడు జాబ్ రోల్స్ గురించి వెల్లడించింది. సర్వేలో 52 శాతం మంది యూఏఈ ఉద్యోగులు జాబ్ సెర్చ్ కష్టతరంగా మారిందని చెప్పారు.  44 శాతం మంది నిపుణులు జాబ్ సెర్చ్ ప్రక్రియ నిరుత్సాహపరుస్తుందని, 43 శాతం మంది ఉద్యోగార్ధులు తాము గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నామని చెప్పారు.  ఈ సవాళ్లను ఎదుర్కొంటూ యూఏఈలోని నిపుణులు కొత్త వృత్తులు, పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు.

యూఏఈ నిపుణులలో దాదాపు 10–76 శాతం మందిలో 8 మంది 2025లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. 53 శాతం మంది పరిశ్రమలను మార్చే లక్ష్యంతో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా యూఏఈలో ఉద్యోగాల కల్పన పెరిగినప్పటికీ, దేశంలోకి ఎక్కువ మంది నిపుణులు రావడంతో పోటీ కూడా విపరీతంగా పెరిగింది. దుబాయ్ స్టాటిస్టిక్స్ సెంటర్ ప్రకారం, దుబాయ్ జనాభా మాత్రమే గత ఏడాది చివరి నాటికి 169,000 కంటే ఎక్కువ పెరిగి 3.825 మిలియన్లకు చేరుకుంది. అదేసమయంలో ప్రపంచ కంపెనీలు యూఏఈకి మకాం మార్చినందున, వారు కంపెనీకి అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వెతుకుతున్నారు.

51 శాతం మంది నిపుణులు తమ జాబ్ సెర్చ్ సమయంలో కష్టపడుతున్నారని, 56 శాతం మంది ప్రక్రియ సమయం తీసుకుంటుందని చెప్పారని లింక్డ్‌ఇన్ కెరీర్ నిపుణుడు నజత్ అబ్దెల్‌హాది తెలిపారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందనే నమ్మకం కారణంగా 53 శాతం మంది ఉద్యోగార్ధులు.. 2025లో కొత్త అవకాశాలను పొందగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారని తెలిపారు.    యూఏఈ, సౌదీ అరేబియాలో సర్వే చేసిన దాదాపు 53 శాతం మంది హెచ్‌ఆర్ నిపుణులు, అర్హత కలిగిన ప్రతిభతో రోల్స్ ను భర్తీ చేయడం కష్టతరంగా మారిందని, 2025లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవలసిన విధానం మారాలని సూచించారు.  19 శాతం మంది రోజుకు 3-5 గంటల మధ్య దరఖాస్తులను జల్లెడ పడుతున్నారని, 77 శాతం మంది తమకు వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల్లో సగం కంటే తక్కువ ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. దాదాపు సగం మంది నిపుణులు (45 శాతం) తాము ఉద్యోగానికి సరిపోతారో లేదో అంచనా వేయడానికి మరింత సమర్థవంతమైన మార్గాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. 32 శాతం మంది సంబంధం లేకుండా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. 

టాప్ 3 రోల్స్
లింక్డ్‌ఇన్ యూఏఈలో పెరుగుతున్న మొదటి మూడు రోల్స్ లో మీడియా బయ్యర్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌లు ఉన్నాయని పేర్కొంది. వీటితోపాటు  సస్టైనబిలిటీ మేనేజర్లు, సేల్స్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్‌లు, టాక్స్ మేనేజర్‌లు, ప్రాసెస్ ఇంజనీర్లు, డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్‌లు, ఫైనాన్షియల్ ప్రైవేట్ క్లయింట్ అడ్వైజర్లు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 16, 2024 మధ్య సెన్సస్‌వైడ్ ద్వారా 22,010 మంది అభిప్రాయాలను సేకరించారు. నవంబర్ 28 నుండి డిసెంబర్ 18, 2024 మధ్య 8,035 గ్లోబల్ హెచ్‌ఆర్ నిపుణులతో ఈ అధ్యయనం జరిగింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com