దావోస్ లో పెట్టుబడుల వేట ప్రారంభించిన సీఎం రేవంత్
- January 21, 2025
దావోస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం రెండో రోజూ దావోస్‌లో పర్యటిస్తోంది. మంగళవారం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొని, కేంద్ర మంత్రులతో కలిసి గ్రాండ్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకెళ్తున్నదని చెప్పారు.
బయోటెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భారత ప్రభుత్వం లక్ష్యమైన 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.
రేవంత్ బృందం నేటి షెడ్యూల్ …
దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాలుపంచుకుంటుంది. ఈనేపథ్యంలో దావోస్ లో రెండో రోజున పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు సమావేశమవనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు.
అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సారధ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు జరుపనుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనుంది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి ఈసారి భారీ పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!