ఐఎస్‌ ఆటకట్టిస్తామని ఒబామా ..

- June 29, 2016 , by Maagulf
ఐఎస్‌ ఆటకట్టిస్తామని ఒబామా ..

ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న ఇస్లామిక్ స్టేట్‌లాంటి ఉగ్రవాద సంస్థలను అంతమొందించే వరకు నిద్రపోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. ఇస్తాంబుల్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. టర్కీతోపాటు నాటో దళాలతో కలిసి పనిచేస్తామని, ఉగ్రవాదుల పీచమణిచే వరకు విశ్రమించబోమని ఆయన అన్నారు. తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నుంచి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌తో మాట్లాడిన ఒబామా.. ఉగ్ర దాడుల్లో మరణించిన 41 మందికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో టర్కీకి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. నాగరిక ప్రపంచంపై ద్వేషాన్ని పెంచుకొని విషం చిమ్ముతున్న ఐఎస్‌లాంటి ఉగ్రవాద సంస్థలు ఎంతోమంది అమాయకులను బలి చేస్తున్నారని, నాటోతో కలిసి వారి ఆటకట్టిస్తామని ఒబామా స్పష్టంచేశారు. వాళ్లు ఆక్రమించుకున్న సిరియా, ఇరాక్‌లలోనూ వాళ్ల పీఠాలు కదులుతున్నాయని, ఆ రెండు దేశాల్లోనూ వారిని ఓడిస్తామని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com