ఏప్రిల్ 22 నుండి అమల్లోకి కొత్త ట్రాఫిక్ చట్టం..!!

- January 24, 2025 , by Maagulf
ఏప్రిల్ 22 నుండి అమల్లోకి కొత్త ట్రాఫిక్ చట్టం..!!

కువైట్: కువైట్ లో ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు కఠిన శిక్షలు,పెనాల్టీలను విడించనున్నారు.ఈ మేరకు పెంచే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలు ఏప్రిల్ 22 నుండి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు కొత్త జరిమానాలు అమల్లోకి వచ్చే వరకు మునుపటి జరిమానాలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.ట్రాఫిక్ చట్టంలోని కొన్ని నిబంధనలకు కొత్త సవరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. సవరించిన చట్టంలోని అతి ముఖ్యమైన నిబంధనలను పౌరులకు, నివాసితులకు తెలియజేయడంతోపాటు రహదారి భద్రతను సాధించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించడాన్ని మెరుగుపరచడం ఈ ప్రచారం లక్ష్యం. చట్టాలను పాటించడం అనేది జీవితాలు, ఆస్తులను రక్షించడంలో దోహదపడే సమిష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com