బీచ్‌లలో' తాబేళ్లు కనిపిస్తున్నాయా? ఏం చేయాలో తెలుసా?

- January 24, 2025 , by Maagulf
బీచ్‌లలో\' తాబేళ్లు కనిపిస్తున్నాయా? ఏం చేయాలో తెలుసా?

దుబాయ్: గత కొన్ని రోజులుగా అధిక గాలులు, చలి ఉష్ణోగ్రతల కారణంగా దుబాయ్ బీచ్‌లలో పెద్ద సంఖ్యలో సముద్ర తాబేళ్లు కొట్టుకువస్తున్నాయి. ఈ సందర్భంగా వాటి సహాయం కోసం కాల్ చేయాలని జుమేరా దుబాయ్ తాబేలు పునరావాస ప్రాజెక్ట్ (DTRP) సోషల్ మీడియాలో పోస్టులో కోరింది. బీచ్‌కి వెళ్లేవారు తాబేళ్లను గుర్తిస్తే వారి రెస్క్యూ హాట్‌లైన్‌ నెంబర్ కు తెలియజేయమని కోరింది.

సముద్ర తాబేళ్లు అనేవి ఇతర సరీసృపాలు వంటివి. వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేవు. శీతాకాలంలో నీరు చల్లగా ఉన్నప్పుడు, అవి తక్కువ చురుకుగా ఉంటాయి. చిన్న తాబేళ్లు అనారోగ్యానికి గురవుతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, అవి ఒడ్డుకు వెళ్లి బీచ్‌లో చిక్కుకుపోతాయి అని పేర్కొంది.

2004లో ప్రారంభించినప్పటి నుండి DTRP వేలకొద్దీ తాబేళ్లను సేవ్ చేసింది. అవి కోలుకున్నాక తిరిగి సముద్రంలోకి విడుదల చేసింది. టోల్-ఫ్రీ హాట్‌లైన్ 800 887853 కు కాల్ చేయమని కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com