2024 పర్యాటక నామ సంవత్సరం.. 10 మిలియన్ హోటల్ రూమ్ బుకింగ్స్..!!

- January 26, 2025 , by Maagulf
2024 పర్యాటక నామ సంవత్సరం.. 10 మిలియన్ హోటల్ రూమ్ బుకింగ్స్..!!

దోహా, ఖతార్: ఖతార్ టూరిజం 2024 వార్షిక పనితీరు నివేదిక ప్రకారం.. ఖతార్ హోటల్ రంగం 2024లో 10 మిలియన్ రూమ్ బుకింగ్స్ అయ్యాయి. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం హోటల్ ఫీల్డ్ 2024 చివరి నాటికి 40,405 రూమ్ లకు చేరుకుంది. అన్ని వసతి విభాగాలలో సగటు పూర్తి ఆక్యుపెన్సీ రేటు 2023తో పోలిస్తే 19 శాతం పెరిగి 69 శాతానికి చేరుకుంది. ప్రీమియం స్టే కోసం కొనసాగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ ఫైవ్ స్టార్, హోటల్ అపార్ట్‌మెంట్ కేటగిరీలలో అత్యధిక ఆక్యుపెన్సీ రేట్లు నమోదయ్యాయి. ఫోర్-స్టార్ హోటళ్లు, హోటల్ అపార్ట్‌మెంట్‌లలో (డీలక్స్, స్టాండర్డ్) ఆక్యుపెన్సీ రేట్లు కూడా 2023తో పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు సగటు ఆక్యుపెన్సీ రేటు 63.7 శాతం సాధించగా, ఫోర్ స్టార్ హోటళ్లు 69 శాతం నమోదు చేయగా, 3-1 స్టార్ హోటళ్లు 70.2 శాతం ఆక్యుపెన్సీ రేటును సాధించాయి. మరోవైపు హోటల్ అపార్ట్‌మెంట్లు 74.6 శాతం ఆక్యుపెన్సీకి చేరుకున్నాయి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్‌లలో ఆక్యుపెన్సీ రేట్లు గరిష్టంగా 85 శాతానికి చేరుకున్నాయి. ఖతార్ టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు 2024 ఒక మైలురాయి సంవత్సరంగా నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు. సందర్శకుల రాకపోకలలో ఐదు మిలియన్ల (5.08 మిలియన్లు) మార్కును అధిగమించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరుగుదల నమోదైంది.

GCC (41 శాతం) అంతర్జాతీయ సందర్శకుల అతిపెద్ద గమ్యస్థానంగా నిలిచింది. యూరప్ (23 శాతం), ఆసియా , ఓషియానియా (20 శాతం), ఇతర అరబ్ దేశాలు (ఎనిమిది శాతం), అమెరికాస్ (ఆరు శాతం) ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలు కనీసం రెండు శాంతంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com