మెడిసిన్ హోమ్ డెలివరీ సర్వీస్ కు పెరుగుతున్న డిమాండ్..!!
- January 26, 2025
దోహా, ఖతార్: మెడికేషన్ హోమ్ డెలివరీ, ఖతార్ హెల్త్‌కేర్ సెక్టార్‌లో ప్రవేశపెట్టిన కొత్త సర్వీసు కు క్రమంగా డిమాండు పెరుగుతుంది. కొత్త సర్వీస్ పై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024లో హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC), ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) హోమ్ డెలివరీ సేవల ద్వారా దాదాపు 60,000 వస్తువులను డెలివరీ చేశాయి.
HMC మరియు PHCC భాగస్వామ్యంతో ఖతార్ పోస్ట్ నిర్వహించే హోమ్ డెలివరీ సర్వీస్.. మెడిసిన్, వైద్య నివేదికలు, వైద్య వినియోగ వస్తువులు, ఆహార ఉత్పత్తులను నేరుగా ఇంటి వద్దకే అందజేస్తుంది. అధికారిక డేటా ప్రకారం, HMC హోమ్ డెలివరీ చేసిన మెడిసిన్స్ సంఖ్య 2024లో 56,436 కు చేరింది. అదే సంవత్సరంలో PHCC ఏడు నెలల్లో 2,223 రకాల మందులను డెలివరీ చేసింది. COVID-19 మహమ్మారి సమయంలో ఏప్రిల్ 2020లో ప్రారంభించారు. ఈ సేవ కోసం QR30 రుసుము వసూలు చేస్తున్నారు.
HMC మందుల హోమ్ డెలివరీ సేవను యాక్సెస్ చేయడానికి ఆదివారం నుండి గురువారం వరకు ప్రతిరోజూ ఉదయం 8 మరియు మధ్యాహ్నం 2 గంటల మధ్య 16000కి కాల్ చేయాలి.
PHCC మందుల హోమ్ డెలివరీ సేవను యాక్సెస్ చేయడానికి, రోగులు వారి ఆరోగ్య కేంద్రం కోసం నిర్దేశించిన నంబర్‌కు లేదా మరింత సమాచారం కోసం 16000కి కాల్ చేయవచ్చు. పిహెచ్‌సిసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నంబర్‌తో వారు తమ ఆరోగ్య కేంద్రాన్ని వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో వస్తువులు డెలివరీ చేయబడతాయి. రోగులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హెల్త్ కార్డ్, మందులు/వస్తువులు, డెలివరీ రుసుములకు చెల్లింపు కార్డ్‌ను సమర్పించాలి. ఈ సేవ దేశవ్యాప్తంగా రోగులందరికీ అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







