ఇండిగో ఎయిర్లైన్స్ వారి గొప్ప ఆఫర్లు

- June 30, 2016 , by Maagulf
ఇండిగో ఎయిర్లైన్స్  వారి గొప్ప ఆఫర్లు

 ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్ల బాటపట్టాయి. ఇప్పటికే గో ఎయిర్‌, ఎయిర్‌ ఏసియా పలు స్కీంలను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్‌ ఇండిగో కూడా ప్రమోషనల్‌ ఆఫర్‌ సేల్‌ను ప్రకటించింది. అన్ని పన్నులతో కలిపి రూ. 1,106 ప్రారంభ ధరలతో విమాన టికెట్లు అందిస్తున్నట్లు తెలిపింది.
జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య దేశీయ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు ఈ ఆఫర్‌ వర్తించనుంది. దీని ప్రకారం.. రూ. 1,106కే శ్రీనగర్‌ నుంచి జమ్ముకు ప్రయాణించొచ్చు. ఇక దిల్లీ నుంచి లఖ్‌నవూకు రూ. 1,500. అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి రూ. 1,200తో టికెట్‌ ధరలు ఉన్నట్లు ఇండిగో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ కింద ఎన్ని సీట్లు కేటాయించబోతోందన్నదన్న విషయాన్ని మాత్రం ఇండిగో స్పష్టం చేయలేదు.
సాధారణంగా వర్షాకాలంలో విమాన ప్రయాణికుల రద్దీ తక్కువ ఉంటుంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com