బుక్ కవర్లలో డ్రగ్స్ స్మగ్లింగ్..5ఏళ్ల జైలుశిక్ష, BD3,000 జరిమానా..!!
- January 28, 2025
మనామా: బుక్స్ కవర్ల లోపల దాచి డ్రగ్స్ ను తరలిస్తున్న ఒక ఆసియా వ్యక్తికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, BD3,000 జరిమానా విధించింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పద పార్శిల్‌ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా డ్రగ్ విషయం బయటకు వచ్చింది. ఓ ఆసియా దేశం నుండి వచ్చిన ప్యాకేజీని స్కాన్ చేయగా, పుస్తక కవర్లలో దాగి ఉన్న డ్రగ్ ను గుర్తించారు. అందులో 1.3 కిలోగ్రాముల బరువున్న "షాబు" (మెథాంఫేటమిన్) ఉందని నిర్ధారించారు. అనంతరం యాంటీ నార్కోటిక్స్ అధికారులు దానిని ట్రాక్ చేస్తూ.. పార్శిల్ తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని కారులో తనిఖీ చేయగా మరో 492.94 గ్రాముల అనుమానిత షాబును గుర్తించారు. బహ్రెయిన్‌లోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే వ్యవస్థీకృత నెట్వర్క్ లో అతడు ఒక వ్యక్తిగా విచారణలో గుర్తించారు. త్వరలోనే మరింత మందిని అరెస్ట్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







