రమదాన్ 2025: జనవరి 31న షాబాన్ ప్రారంభం..!!

- January 28, 2025 , by Maagulf
రమదాన్ 2025: జనవరి 31న షాబాన్ ప్రారంభం..!!

దుబాయ్: యూఏఈలో హిజ్రీ నెల షాబాన్ జనవరి 31న(శుక్రవారం) ప్రారంభమవుతుందని యూఏఈ అస్ట్రానమీ సెంటర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ముస్లింలు ఆచరించే పవిత్రమైన రమదాన్ నెలకు ముందు వచ్చే నెలనే షాబాన్ అంటారు.  రమదాన్ ప్రారంభమయ్యే ఖచ్చితమైన తేదీ చంద్రుని వీక్షణపై ఆధారపడి ఉన్నప్పటికీ, ఇది చాలావరకు మార్చి 1న ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

" జనవరి 29 అనేక ముస్లిం దేశాలలో 1446 AH రజబ్ 29వ తేదీకి అనుగుణంగా ఉంటుంది. ఈ రోజున ఇస్లామిక్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి షాబాన్ కోసం నెలవంకను చూడటం అసాధ్యం. సూర్యాస్తమయానికి ముందు లేదా అదే సమయంలో అస్తమిస్తుంది. కాబట్టి జనవరి 31 శుక్రవారం షాబాన్ మొదటి రోజు అవుతుంది." అని సెంటర్ డైరెక్టర్ మహ్మద్ షౌకత్ ఓదే తెలిపారు.  జనవరి 30న  అన్ని ముస్లిం దేశాలు, దక్షిణ యూరప్, ఆఫ్రికా, యుఎస్‌లలో నెలవంకను చూడవచ్చని కేంద్రం తెలిపింది.  రజబ్ 29 ఉన్న దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఇరాన్, బంగ్లాదేశ్, మొరాకో, మౌరిటానియా, కామెరూన్, అల్బేనియా) జనవరి 31 ఉపవాస నెల మొదటి రోజుగా ఉంటుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com