కువైట్ లో పలు భాషల్లో ట్రాఫిక్ అవగాహన ప్రచారం..!!
- January 29, 2025
కువైట్: కొత్త ట్రాఫిక్ చట్ట సవరణల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతమైన అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. కువైట్‌లోని పౌరులు, నివాసితులందరికీ చేరేలా ఈ ప్రచారం ఆరు భాషలలో నిర్వహించనుంది. అరబిక్‌తో పాటు, ఇంగ్లీష్, ఫార్సీ, హిందీ, బెంగాలీ, ఉర్దూ, తగలోగ్లలో ప్రచారం అందుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ చట్టం అప్డేట్ నిబంధనలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ చొరవ ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి, సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ విస్తృత ప్రయత్నాలలో భాగమని తెలిపింది. దీనిని సాధించడానికి సాంప్రదాయ పద్ధతులతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుంటామని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







