‘సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్’–మీ మొబైల్‌లో తక్షణ ట్రాఫిక్ అప్డేట్లు!
- January 31, 2025
సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ సేవను సంయుక్తంగా ప్రారంభించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC).
టాన్లా ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వ్యవస్థ ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించేందుకు, రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికులకు (రియల్-టైమ్) ట్రాఫిక్ సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సేవ ద్వారా ట్రాఫిక్ పరిస్థితులు, రోడ్డు మూసివేతలు, ప్రమాదాలు, Traffic restrictions/Diversions, ముఖ్యమైన నగర కార్యక్రమాలు వంటి అంశాలపై సమాచారాన్ని నేరుగా మీ మొబైల్‌కి WhatsApp, Google RCS, SMS లేదా Flash మెసేజ్‌ల రూపంలో పంపించబడుతుంది.
సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ప్రత్యేకతలు:
తక్షణ ట్రాఫిక్ అప్డేట్లు: ముఖ్యమైన రహదారుల ట్రాఫిక్ సమాచారం, మార్గదర్శకాలు, మళ్లింపులు ముందుగా తెలుసుకోవచ్చు.
సరైన సమాచారం: రద్దీ కారణాలు, సాధారణ పరిస్థితికి తిరిగి రావడానికి పట్టే సమయం వంటి వివరాలను ఖచ్చితంగా అందిస్తుంది.
ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యక్ష కమ్యూనికేషన్: WhatsApp ద్వారా ట్రాఫిక్ పోలీసులతో చాట్ చేసి మీ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యల గురించి సూచనలు ఇవ్వొచ్చు.
వ్యక్తిగత సేవ: మీ ప్రయాణ మార్గాలు, ప్రయాణ పద్ధతులను బట్టి మీకు అవసరమైన అప్డేట్లు మాత్రమే పొందేలా సెటప్ చేసుకోవచ్చు.
ఈ సేవను ఎలా పొందాలి?
QR కోడ్ స్కాన్ చేయండి లేదా వెబ్‌సైట్‌ను సందర్శించండి:
- సులభమైన స్టెప్‌లను అనుసరించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
- ప్రయాణానికి ముందు మీ రూట్‌పై తాజా ట్రాఫిక్ అప్డేట్లు పొందండి!
అధికారుల అభిప్రాయాలు:
అవినాష్ మోహంతి, కమీషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్
"సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నగర ప్రయాణికుల కోసం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ విప్లవాత్మక సేవను ప్రారంభించేందుకు మాకు తోడ్పడిన SCSC, టాన్లా ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్‌కు మా ప్రత్యేక కృతజ్ఞతలు."
ఎస్సీ ఎస్సీ జాయింట్ సెక్రెటరీ రాజేశ్ మాట్లాడుతూ* "సురక్షితమైన, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం మా లక్ష్యం. సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ప్రజలకు వారి రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రాముఖ్యత కలిగిన మైలురాయి."
టాన్లా చీఫ్ కస్టమర్ ఆఫీసర్, సీఈఓ శ్రీరామ్ మాట్లాడుతూ.. "తరచుగా ప్రయాణించే మార్గాల్లో ప్రయాణించే పౌరులు ట్రాఫిక్ పరిస్థితుల గురించి అవగాహన లేకుండా ఉంటారు,తద్వారా ongoing ట్రాఫిక్ రద్దీకి లోనవుతారు.ఈ సమస్యను పరిష్కరించడానికి 'సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్'ను ప్రారంభించడంలో టాన్లా సహకరించడంతో సంతోషంగా ఉంది. ఈ పరిష్కారం కోసం WhatsApp, Google RCS, SMS, మరియు Flash SMS వంటి మొబైల్ ప్లాట్‌ఫారమ్లపై అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తుంది.
మా 'Tech for Good' తత్వాన్ని ముందుకు తీసుకెళ్లుతూ, ఈ పరిష్కారం నిజ-సమయంలో సమాచారాన్ని అందిస్తుంది. తద్వారా ప్రజలు సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకోవడంలో, రద్దీ మార్గాలను నివారించి, వారి ప్రయాణ సమయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది."
మీరు కూడా భాగస్వామ్యం కండి!
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అందరికీ ఈ సేవను వినియోగించుకోవాలని ఆహ్వానిస్తోంది. స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో భాగమవ్వాలంటే https://cyberabadtrafficpulse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
ట్రాఫిక్ పల్స్ అంటే ఏమిటి?
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అందిస్తున్న రియల్-టైమ్ ట్రాఫిక్ అలర్ట్ సర్వీస్. ఇది ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించి ప్రయాణికులకు సమాచారం అందించేందుకు రూపొందించబడింది.
ఈ సేవకు ఎలా నమోదు చేసుకోవాలి?
https://cyberabadtrafficpulse.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీ వివరాలు నమోదు చేసి, SMS ద్వారా వచ్చిన కోడ్‌ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తిచేయండి.
ఇది మొబైల్ యాప్‌లా పని చేస్తుందా?
లేదు, ఇది ప్రత్యేక యాప్ కాదు. మీ మొబైల్‌కు నేరుగా WhatsApp, Google RCS లేదా SMS ద్వారా సమాచారాన్ని పంపించే సేవ మాత్రమే.
ఈ సేవ పూర్తిగా ఉచితమా?
అవును, ఈ సేవను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, టాన్లా ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్, SCSC కలిసి ఉచితంగా అందిస్తున్నారు.
ట్రాఫిక్ పల్స్ ద్వారా ఏవేవి అప్డేట్లు అందుతాయి?
- ప్రధాన రహదారుల ట్రాఫిక్ స్థితి.
- రోడ్డు మూసివేతలు, మళ్లింపులు.
- Traffic restrictions/Diversions.
- ప్రధాన నగర కార్యక్రమాలు వల్ల ట్రాఫిక్‌పై ప్రభావం
నేను నాకు అవసరమైన మార్గాలకే అప్డేట్లు పొందే వీలుందా?
అవును, రిజిస్ట్రేషన్ సమయంలో మీకు అవసరమైన ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు.
నా వ్యక్తిగత సమాచారం భద్రంగా/ప్రైవసీ ఉంటుందా?
అవును, మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది. ట్రాఫిక్ పల్స్ మీ డేటాను ఏ ఇతర సంస్థలతో పంచుకోదు.
ఈ సేవను నిలిపివేయాలంటే ఎలా?
https://cyberabadtrafficpulse.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి "Unsubscribe" ఆప్షన్ ద్వారా సేవను నిలిపివేయొచ్చు.
నా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ సేవను పంచుకోవచ్చా?
అవును, మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ లింక్ పంపించి వారిని కూడా ఈ సేవలో భాగం చేయవచ్చు.
ట్రాఫిక్ పల్స్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?*
సహాయానికి Cyberabad Traffic Police Helpline లేదా ట్రాఫిక్ పల్స్ వెబ్‌సైట్‌లో ఉన్న కాంటాక్ట్ ఫారమ్‌ను ఉపయోగించండి.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







