ఇంటి యజమానులకు పన్ను మినహాయింపు!

- February 03, 2025 , by Maagulf
ఇంటి యజమానులకు పన్ను మినహాయింపు!

న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2025 లో ఇంటి యజమానులకు శుభవార్త లభించింది. కొత్త పన్ను ప్రయోజనాల ప్రకారం, స్వీయ-ఆక్రమిత గృహాలకు పన్ను మినహాయింపులు పెంచడం ద్వారా గృహ యజమానులకు ఊరట కలిగించారు. ఇంతకు ముందు, ఒకే ఒక్క స్వీయ-ఆక్రమిత ఇంటి పై మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. అయితే, తాజా బడ్జెట్ ప్రకారం, ఇప్పుడు రెండు స్వీయ-ఆక్రమిత గృహాల పై కూడా పన్ను మినహాయింపు పొందే వీలుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 23(2) సవరణ ద్వారా ఈ ప్రయోజనాలను అమలు చేయనున్నారు.

ఇంటి యజమాని స్వయంగా నివసిస్తున్న గృహాల వార్షిక విలువను (Annual Value) “శూన్యం”గా పరిగణించనున్నారు, అంటే, వీటి పై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు. ఈ మార్పు కిరాయికి ఇళ్లు ఇవ్వకుండా స్వయంగా నివసించే వారి కోసం ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా, అద్దెకు సంబంధించిన ఇంటి పన్ను మినహాయింపు (TDS) పరిమితి కూడా పెరిగింది. గతంలో రూ. 2.4 లక్షల వార్షిక అద్దెపై TDS కట్టాల్సి ఉండేది. బడ్జెట్ 2025 ప్రకారం, ఈ పరిమితిని రూ. 6 లక్షల కు పెంచారు. అంటే, ఇప్పుడు రూ. 6 లక్షల వరకు అద్దె అందుకునే భూస్వాములకు TDS మినహాయింపు లభించనుంది. అదనంగా, నెలవారీ TDS పరిమితిని రూ. 24,000 నుండి రూ. 50,000 కు పెంచారు.దీంతో చిన్న స్థాయి భూస్వాములు మరియు అద్దెదారులకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది.

కేంద్ర బడ్జెట్ 2025లో తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంటి యజమానులకు, భూస్వాములకు, చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట కలిగించాయి. ప్రత్యేకించి స్వీయ-ఆక్రమిత గృహాలకు మినహాయింపును రెండు ఇళ్లకు విస్తరించడం, TDS పరిమితి పెంచడం వంటి మార్పులు లక్షలాది మంది గృహ యజమానులకు ప్రయోజనకరంగా ఉంటాయి. దీని వల్ల మధ్య తరగతి మరియు చిన్న స్థాయి యజమానులు ఆర్థికంగా మరింత లాభపడే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com