ఒమాన్ లో బిచ్చగాళ్లపై నిబంధనల కొరడా ఝళిపించిన అధికారులు

- July 09, 2015 , by Maagulf
ఒమాన్ లో బిచ్చగాళ్లపై నిబంధనల కొరడా ఝళిపించిన అధికారులు

 

 ఒమాన్ సాంఘిక అభివృద్ధి శాఖ మరియు రాయల్ ఒమానీ పోలీసు వారు కలసి, పవిత్ర రమదాన్ పర్వదినాలలో దానాలు చేసే సంప్రదాయాన్ని దురుపయోగం చేసే యాచకుల సంఘటనలు పెచ్చు మీరడంతో రంగంలోకి దిగారు. ఇటువంటి ఘటనలను కనిపెట్టడానికి రాజ్యమంతా ఇనస్పెక్టర్లనునియమించామని, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా 24794949 అనే నంబరుతో ఫోనులైనును అందుబాటులోకి తెచ్చామని ఆంటీ-బెగింగ్ స్క్వాడ్ ఉన్నతాధికారి అబ్దుల్లా అల్ తలీ తెలిపారు. ప్రజల దాతృత్వాన్ని ఆసరాగా తీసుకొనే వారినే కాక, చిన్నారులను భిక్షాటనకు వినియోగించేవారిని,  యాచకుల ముసుగులో,ఇళ్ళలో ఒంటరిగా ఉన్నవారిని దోచుకో చూసేవారిని గురించి ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు కూడా వీరు చేపడుతున్నారు.

 

--నూన్ లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com