సౌదీ అరేబియా-ఇండియా ఇండస్ట్రీయల్ పార్టనర్ షిప్ బలోపేతం..!!
- February 04, 2025
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా పరిశ్రమ, ఖనిజ వనరుల శాఖ మంత్రి బందర్ అల్ఖోరాయేఫ్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ భారత మంత్రులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక భాగస్వామ్యాన్ని విస్తరించడం, కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడం ఈ సమావేశాల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. భారత పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ - అల్ఖోరాయేఫ్ మధ్య జరిగిన సమావేశంలో, సౌదీ అరేబియాలో వ్యూహాత్మక పారిశ్రామిక రంగాల వృద్ధికి తోడ్పడేందుకు పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాలను విస్తరించడం, నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించడం వంటి మార్గాలపై వారు చర్చించారు. అల్ఖోరాయెఫ్ రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలను గుర్తుచేశారు.
భారత రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామితో అల్ఖోరాయేఫ్ విడివిడిగా సమావేశమయ్యారు. పెట్రో కెమికల్స్, ఎరువులు, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, భారీ యంత్రాలు, ఆటోమొబైల్స్, విడిభాగాలు సహా కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చలు దృష్టి సారించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష