హార్స్ రైడ్ లో ప్రమాదం.. మహిళకు అంగవైకల్యం..BD3,000 పరిహారం..!!
- February 07, 2025
మనామా: ఓ బహ్రెయిన్ యువతి హార్స్ రైడ్ చేస్తున్న సమయంలో మరో హార్స్ దాడి చేయడంతో 5% శాశ్వత వైకల్యానికి గురైంది. ఈ సంఘటనపై హార్స్ రైడ్ నిర్వహక యజమానిపై చట్టపరమైన చర్యలకు దిగారు. దీనిపై ఇటీవలి కోర్టు తీర్పు ఇచ్చింది. గాయపడ్డ మహిళకు 3,000 బహ్రెయిన్ దినార్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. మహిళ లాయర్ అల్ ఖైద్ ప్రకారం, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా కోర్టు తీర్పునిచ్చింది. నిర్వాహకుల పొరబాటు కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. భౌతిక నష్టానికి 2,500 బహ్రెయిన్ దినార్లు, నైతిక నష్టాలకు 500 దినార్లను నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







