ఒమన్-ఇండియా..పెట్టుబడి అవకాశాలపై సమీక్ష..!!

- February 07, 2025 , by Maagulf
ఒమన్-ఇండియా..పెట్టుబడి అవకాశాలపై సమీక్ష..!!

న్యూఢిల్లీ: ఆహారం, ఔషధాలు, వైద్య ఉత్పత్తులు, వ్యవసాయం, సమాచార సాంకేతికత, పెట్రోకెమికల్స్, ఇంధనం వంటి వివిధ కీలక రంగాలలో రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలపై ఇండియాలోని న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయం ఇంటరాక్టివ్ రౌండ్‌టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశాల లక్ష్యమని తెలిపింది. ఈ సమావేశాల్లో పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. ఒమన్‌లోని వ్యాపార వాతావరణాన్ని, అలాగే ఒమన్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్‌లు , పారిశ్రామిక నగరాల్లో విదేశీ పెట్టుబడిదారులకు అందించే ప్రముఖ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ఒమన్ - ఇండియా మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com