తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమం

- July 01, 2016 , by Maagulf
తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమం

తెలంగాణలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం పునుకుడు చెలక గ్రామం వద్ద హరిత విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రక్షణశాఖ అధికారులు... కేంద్ర పౌరవిమానయాన శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్‌తో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ రక్షణ శాఖకు లేఖ రాసింది. దీంతో రక్షణశాఖ అధికారులు కొత్తగూడెం ప్రాంతాన్ని పరిశీలించి అధ్యయనం చేశారు. రక్షణ పరంగా ఎలాంటి సమస్యలు లేదని తేల్చారు. విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని .. రక్షణ శాఖ విమానాలు, హెలికాప్టర్లు నిలిపేందుకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని సూచించారు. విమానాశ్రయంలో రేడియో నావిగేషన్‌తో పాటు ఇతర వసతులు ఉండాలని సూచించారు. రక్షణ శాఖ అనుమతి రావడంతో త్వరలోనే పౌరవిమానయాన శాఖ, హోంశాఖల నుంచి అనుమతి వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పునుకుడు చెలక వద్ద భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తిచేసిన అధికారులు... విమానాశ్రయానికి అవసరమైన మిగిలిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com