బహ్రెయిన్ లో పింఛన్ల కోసం అత్యవసర రిజర్వ్ ఫండ్..!!
- February 09, 2025
మనామా: పెన్షన్ల కోసం ప్రభుత్వ మద్దతుతో అత్యవసర రిజర్వ్ ఫండ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రానుంది.అదనపు ఖర్చులతో కార్మికులపై భారం పడకుండా పెన్షన్ చెల్లింపులను చేయనున్నారు.ఈ మేరకు మిగులు రాబడిని ఉపయోగించేందుకు ఈ ఫండ్ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యూచర్ జనరేషన్స్ రిజర్వ్ ఫండ్ మాదిరిగానే, ఈ పథకం అంతర్జాతీయ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెన్షన్ కొరత నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంపీలు బాదర్ సలేహ్ అల్ తమీమి, అహ్మద్ సల్మాన్ అల్ ముసల్లం, మహ్మద్ అల్ అహ్మద్, డా. హిషామ్ అల్ అషిరి, హమద్ అల్ డోయ్ ప్రతిపాదించిన వారిలో ఉన్నారు. ఆరోగ్యకరమైన పెన్షన్ ఫండ్‌ను నిర్వహించడం కోసం ప్రస్తుత, భవిష్యత్తులో పదవీ విరమణ చేసిన వారికి బాధ్యతలను తీర్చడానికి ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయడం కోసం ఇది అత్యవసరమని ఎంపీలు పేర్కొన్నారు. దీనిని పార్లమెంట్ ఆమోదించబడినట్లయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వివరించిన అంతర్జాతీయ పద్ధతులతో ఫండ్ పనిచేయనుంది. ఇది అత్యవసర పెన్షన్ నిల్వలు, భవిష్యత్తు పొదుపు వంటి ఉపయోగాల కోసం నిధులను వర్గీకరిస్తుంది. ఈ మార్పు బహ్రెయిన్ తన పెన్షన్ నిల్వలను నిర్వహించడానికి పెట్టుబడులపై ఆధారపడటానికి అనుమతిస్తుందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







