ఫిబ్రవరి 23న Dh1 మిలియన్ హోప్ మేకర్ బహుమతి ప్రదానం..!!

- February 09, 2025 , by Maagulf
ఫిబ్రవరి 23న  Dh1 మిలియన్ హోప్ మేకర్ బహుమతి ప్రదానం..!!

దుబాయ్: హోప్ మేకర్స్  1 మిలియన్ దిర్హామ్ అవార్డు ఐదవ ఎడిషన్‌లో 26,000 మందికి పైగా యువకులు, మహిళలు పాల్గొన్నారని దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. హోప్ మేకర్స్ అవార్డు విజేతల మానవతా.. ఇతరులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన వారి కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. "ఆశను కలిగించడం అంటే జీవితాన్ని నిర్మించడం అని జీవితం నాకు నేర్పింది. ఆశ అనేది మనం జీవించే వాస్తవికతను మనం కోరుకునే భవిష్యత్తుతో అనుసంధానించే బ్రిడ్జీ. నిరాశ వారిని నియంత్రించకుండా లక్షలాది మంది యువతకు వంతెనలు నిర్మించడానికి మనం దోహదపడాలి. ఎందుకంటే ఆశను నమ్మడం అంటే జీవితాన్ని నమ్మడం" అని యూఏఈ ఉపాధ్యక్షుడు,ప్రధాన మంత్రి కూడా అయిన షేక్ మొహమ్మద్ అన్నారు.  

గత విజేతలు
2017లో200,000 కంటే ఎక్కువ మంది శరణార్థుల ప్రాణాలను కాపాడడంలో సహాయపడిన మొరాకోకు చెందిన నవాల్ అల్ సౌఫీకి అరబ్ హోప్ మేకర్ అవార్డు లభించింది. కైరో వీధుల్లో నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించినందుకు ఈజిప్టుకు చెందిన మహమూద్ వాహిద్‌కు 2018లో అరబ్ హోప్ మేకర్ అవార్డు లభించింది. 2020లో విజేత ఎమిరాటీ అహ్మద్ అల్ ఫలాసి, కెన్యాలోని మొంబాసాలో అధునాతన కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు మరియు ఇంక్యుబేటర్లను స్థాపించడంలో తన మిషన్‌కు అవార్డు గెలుచుకున్నాడు. 2024లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వందలాది మంది యువకులను, దృఢ సంకల్పం ఉన్న పిల్లలను చూసుకునే ఇరాకీ ఫార్మసిస్ట్ తాలా అల్ ఖలీల్ ప్రతిష్టాత్మక అవార్డు విజేతగా నిలిచారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com