అత్యాధునిక పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం
- February 09, 2025
విజయవాడ: ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దడం అభినందనీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ స్పెషాలిటీ, ట్రామా, క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు.సూర్యారావుపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్టార్ హాస్పిటల్స్ ఎండీ మన్నవ గోపీచంద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు.ప్రత్యేక కేంద్రాల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, నేత్ర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా విస్తృత స్థాయిలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, పేద ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత పాతికేళ్లుగా ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సేవలందిస్తున్న డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు ప్రస్థానం అమోఘమని మంత్రి కొనియాడారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రికి అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ..రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందిస్తామని అన్నారు.హాస్పిటల్ సీఈవో డాక్టర్ ఆకాశ్ పల్లెం మాట్లాడుతూ.. ‘కార్పొరేట్ క్వాలిటీ.. ఎఫర్డబుల్ రియాలిటీ’ నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా తమ హాస్పిటల్ ను తీర్చిదిద్దామన్నారు. మొత్తం 150 బెడ్లు.. 8 ఐసీయూలతో 100 క్రిటికల్ కేర్ బెడ్లతో వివిధ విభాగాల వైద్య సేవలను ఒకేచోట అందిస్తామని తెలిపారు. కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా తదితర విభాగాలకు సంబంధించిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు సేవలందిస్తారని డాక్టర్ ఆకాశ్ వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీహెచ్. ప్రసాద్ బాబు, డాక్టర్ ఎస్. భాను ప్రభాకర్, డాక్టర్ వి. సుశాంత్ రెడ్డి, డాక్టర్ సింధు చాగంటి, డాక్టర్ పవన్ సాయి పోతుల,డాక్టర్ కె.శ్రీనివాస్ బాబు, డాక్టర్ రామ్ ప్రతాప్ కొనకళ్ల, డాక్టర్ కె. రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







