2,234 లేబర్ సంబంధిత ఫిర్యాదులు
- July 01, 2016
ఇండియన్ ఎంబసీ, నెలవారీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించింది. కాన్సులర్ సమస్యలను, ఇతరత్రా సమస్యల గురించి ఒనైజాలో ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. రాయబారి సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్ సహా పలువురు వ్రముఖులు తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అలాగే ఫిర్యాదులు చేసినవారితో మాట్లాడారు. ఆయా కేసుల్ని ఎంబసీ ఫాలో అప్ చేఉ్తందని తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) వైస్ ప్రెసిడెంట్ బేబీ కెరియన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంబసీ టీమ్ సెంట్రల్ ప్రిజన్‌ని సందర్శించింది. సెంట్రల్ ప్రిజన్ - డిపోర్టేషన్ సెంటర్లో 129 మరియు 98 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 2,234 ఫిర్యాదుల్ని లేబర్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ అందుకుంది. 2015లో ఈ సంఖ్య 4,132గా ఉంది. ఇదిలా ఉండగా ఐసిబిఎఫ్, కార్మికులకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తోంది. విమాన టిక్కెట్లు అందించడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









