పదవీవిరమణ

- February 12, 2025 , by Maagulf
పదవీవిరమణ

ఏ‌చోటైనా సాగించాలనే సుఖజీవనం 
ఎదలోతుల్లో దొంతర్ల ఆలోచనల పర్వం 
ఎదనిండుగా తడిఆరనివ్వని జ్ఞాపకం 
ఏదో ఒక క్షణమైనా అర్ధంకాని‌ మౌనం 
ఎంత ఆలోచించినా చిక్కని సమాధానం..

ఏకబిగిన పరుగుతీసిన యవ్వనం 
ఎన్నో భయాందోళనలతో మోసే భారం 
ఏ ఒత్తిడి నైనా తట్టుకోమనేలా కాలం 
ఎదురుదెబ్బలకి ఎదురీదేలా మనసున నిర్వేదం 
ఎన్నో సంఘర్షణల నడుమ చిదిమేసే ఆశయం...

చూపు సన్నగిల్లి సత్తువ లేక తోలు వడలిన 
శేషజీవనం శాపగ్రస్తం కాదని మరో కొత్త 
జీవనంకి శ్రీకారం చుట్టి నూతనోత్సాహంతో 
సాగించాలి‌ పదవీవిరమణ‌ వయసులోనే
నూతన జీవనము...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com