సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!

- February 12, 2025 , by Maagulf
సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!

మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్ తన టూరిజం ఇన్వెస్ట్‌మెంట్ ల్యాండ్‌స్కేప్‌ను డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ‘రిమల్ పార్క్’గా అభివృద్ధి చెందుతుంది. ఇది ఉత్తేజకరమైన ఓపెన్-ఎయిర్ సినిమాని కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం డెస్టినేషన్ గా రూపొందిస్తున్నారు. నఖల్‌లోని విలాయత్‌లోని ఖబత్ అల్ ఖైదాన్‌లోని అల్ అబ్యాద్ సాండ్ వద్ద ఉన్న ఈ పార్క్ సందర్శకులకు ప్రకృతి రమణీయతను, ఆధునిక సౌకర్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 7,806 చదరపు మీటర్లలో రానుంది. ఇందులో ఓపెన్-ఎయిర్ సినిమాలో ఒకేసారి 2వేల మంది అతిథులు కూర్చునేలా రూపొందించారు.  పార్క్ ఐదు ప్రధాన విభాగాలతో 24,814చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎంటర్ టైన్ మెంట్  ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి విస్తృత వినోద కార్యక్రమాలను అందిస్తుంది.

225,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రిమాల్ పార్క్ మస్కట్ నుండి నార్త్ అల్ బతినాకు కలిపే ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. ఇది సందర్శకులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ పార్క్ క్యాంపింగ్ యూనిట్లు, ఈక్వెస్ట్రియన్ స్కూల్, ఈ ప్రాంతంలోని చిన్న మధ్య తరహా సంస్థలకు (SMEలు) మద్దతునిచ్చే లక్ష్యంతో వివిధ కార్యకలాపాలను కూడా అందిస్తుంది. దక్షిణ అల్ బతినా గవర్నర్ మసౌద్ బిన్ సయీద్ అల్ హషిమి ప్రాజెక్ట్ ఒక ప్రధాన పర్యావరణ-పర్యాటక గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ఉందని తెలిపారు.

ఒమన్ విజన్ 2040తో రిమల్ పార్క్ ప్రాజెక్ట్ స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వైవిధ్యీకరణపై ఫోకస్ చేయనుంది. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, స్థానిక వ్యాపారాలకు మేలు చేస్తుందని, గవర్నరేట్ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. సుమారు OMR6.9 మిలియన్ల విలువ కలిగిన ఈ ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com