యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- February 17, 2025
యూఏఈ: యూఏఈలోని ప్రధాన రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్ని అమలు చేస్తున్నారని, ధరలను పెంచలేదని యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ టౌక్ అల్ మర్రి తెలిపారు. వంట నూనె, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలు మార్గదర్శకాలకు అనుగుణంగా స్పష్టంగా ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అల్ మర్రి యూనియన్ కోప్, లులు ఇతర ఐదు ప్రధాన అవుట్‌లెట్‌లను సందర్శించారు.
డిసెంబరు 2024న, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేకుండా తొమ్మిది ప్రాథమిక వినియోగ వస్తువుల ధరలను రిటైలర్లు పెంచలేరని పేర్కొంది. 2025 నుండి బేసిక్ కమోడిటీల ధరలలో వరుసగా రెండు పెరుగుదలల మధ్య కనీసం ఆరు నెలల సమయం ఉంటుందని తెలిపింది. కొత్త విధానంలో వస్తువుల ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని రిటైలర్లను కోరింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!