ఏపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్
- February 17, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.ఈ యాత్రల ద్వారా విద్యార్థులకు రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని శాస్త్రీయ, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది.ఈ విద్యా పర్యటనల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, మానసిక వికాసాన్ని ప్రోత్సహించడం,శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.ముఖ్యంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ రంగాల పై అవగాహన కల్పించడంలో ఈ యాత్రలు కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,784 మంది విద్యార్థులు
ఈ విజ్ఞాన విహార యాత్రలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ప్రదేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయి. సంప్రదాయ కళా కేంద్రాలు, పురావస్తు ప్రదేశాలు, పరిశోధనా సంస్థలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కేంద్రాలు వంటి వాటిని సందర్శించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కొత్త విషయాలపై అభిరుచిని పెంపొందించడంతో పాటు వారి అనుభవాలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 7,784 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. విద్యార్థుల భద్రత, మార్గదర్శకత్వం కోసం ఎస్కార్ట్ ఉపాధ్యాయులను కూడా నియమించనున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!