ఎన్ఐఏ దర్యాప్తులోకీలక అంశాల వెల్లడి
- July 02, 2016
ఇస్లామిక్ స్టేట్ స్థాపనకు ప్రతిజ్ఞ చేశాం...ఆ వీడియో మెసేజ్‌ను ఐఎస్ఐఎస్ చీఫ్ బాగ్దాదీకి పంపించాం హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు శనివారం ఎన్ఐఏ మొదటిరోజు విచారణలో వెల్లడించిన సంగతులివి. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్రపన్నిన వ్యవహరంలో అరస్టైన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను కస్టడీలోకి తీసుకుని ఎన్ఐఏ శనివారం నుంచి విచారణను ప్రారంభించింది. మొదటి రోజు వెలుగులోకి వచ్చిన విషయాలతో మరికొంత మంది అనుమానితుల వివరాలను ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. పేలుళ్ల కోసం బాంబులు తయారీ చేయడంతో పాటు విధ్వంసం త్వరాత పోలీసులకు దొరకకుండా దాక్కొనేందుకు ఈ యువకులు హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో రహస్య స్థావరాల కోసం గాలించారు. నగరంలో బాంబు పేలుళ్ళు జరపాలని నిర్ణయించుకున్న యువకులు ఐదుగురిలో ఎవరెవరు ఏయే బాధ్యతలను నిర్వహించాలనేది ముందుగానే అనుకున్నారట. ఎన్ఐఏ అధికారులు తమ విచారణలో ఈ సంగతిని రాబట్టారు. ఈ ఐదుగురికి అరబ్ దేశాల నుంచి హవాలా, మనీట్రాన్స్‌ఫర్ సంస్థల ద్వారా నగదు అందినట్టు వెల్లడైంది. దీంతో వీరి లావాదేవీలపై ఎన్ఐఏ ఆధారాలు సేకరిస్తున్నది. వీరంతా నిత్యం నేరుగా కలుసుకోకుండా ఈమెయిల్, చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. అదేవిధంగా తమకు ఆదేశాలు జారీచేసే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదితో కూడా వీరు ఈమెయిల్, చాటింగ్ ద్వారానే సంప్రదింపులు జరిపేవారట. బాంబుల తయారీ కోసం కావాల్సిన పేలుడు పదార్థాలు, రసాయనాలు, తుపాకులను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సేకరించినట్టు వివరించారు. పట్టుబడ్డ ఐదుగురిలో ఒకరు సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్టు కూడా ఎన్ఐఏ విచారణలో బయటపడింది. పట్టుబడ్డ వారిలో ఇబ్రహీం, ఇలియాజ్‌లు అన్నదమ్ములని హబీబ్, ఫహాద్‌లు దగ్గరి బంధవులను తేలింది. వీరి దగ్గర దొరికిన పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







