మహా శివరాత్రికి ముస్తాబవుతున్న వేములవాడ ఆలయం
- February 21, 2025
తెలంగాణ: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులు భారీగా రానున్నందున వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, కార్పెట్లతో పాటు టెంపుల్కు లైటింగ్, ప్రత్యేక పార్కింగ్, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
వేములవాడలో ఈనెల 25,26,27 తేదీల్లో జాతర నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. జాతర సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు గుడి చెరువు వద్దగల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సొంత వాహనాలలో వచ్చే వారు తిప్పాపూర్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని..అక్కడి నుంచి ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
కాగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ దేవస్థానం అర్చకులు, అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు మహాశివరాత్రి జాతర ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి జాతర వేడుకలు ఈ నెల 25 నుంచి 27 వరకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







