మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో 'ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్' ప్రారంభం
- February 22, 2025
హైదరాబాద్: క్యాన్సర్ చికిత్సలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి, ప్రతి రోగికి వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పోషకాహార మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సరైన పోషకాహారం – క్యాన్సర్ చికిత్సల ఫలితాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. క్యాన్సర్ చికిత్సలు (cancer treatments) కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు కొనసాగుతాయి మరియు చాలా క్యాన్సర్ చికిత్సలు దుష్ప్రభావాలు కలిగిస్తాయి.నోటి పుండ్లు, ఆకలి లేకపోవడం, అలసట, వికారం, వాంతులు, రుచి కోల్పోవడం మొదలైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. ఇటువంటి దుష్ప్రభావాల వల్ల సరిగా ఆహారం తీసుకోలేక పోవచ్చు లేదా తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించలేక పోవచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రూపొందించిన శక్తివంతమైన మందులు మరియు చికిత్సా విధానాలను తట్టుకోవడానికి శరీరానికి సరైన పోషకాహారం అవసరం. పేషెంట్స్ తీసుకుంటున్న చికిత్సా విధానానికి, ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలకు, మరియు శరీరానికి తగినట్లుగా ప్రత్యేకంగా రూపొందించబడిన ఆహార ప్రణాళిక ద్వారా కావాల్సిన పోషకాహారం పొందవచ్చు. ఇటువంటి పోషకాహారం క్యాన్సర్ చికిత్స సమయంలో బలంగా ఉండడానికి మరియు దుష్ప్రభావాలను నియంత్రించడంలో కూడా మంచి ఆహారం సహాయం చేస్తుంది. సరైన ఆహారం క్యాన్సర్ చికిత్సను కొనసాగించడానికి మరియు మరింత శక్తితో బలంగా ఉండటానికి సహాయపడుతుంది & చికిత్స విజయానికి కీలకం.ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మా డైటీషియన్ మీ క్యాన్సర్ రకం, చికిత్స రకం, మీ ప్రస్తుత శారీరక మరియు వైద్య పరిస్థితి అనుగుణంగా క్యాన్సర్ చికిత్సలను తట్టుకొని, త్వరగా కోలుకోవడానికి శరీరానికి ఉపయోగపడేలా రూపొందించబడతాయి. మీ రోజువారీ పోషకాహార అవసరాల ఆధారంగా, తయారీ విధానాలతో పాటు మీకు భోజన ప్రణాళిక (Diet Plan) అందించబడుతుంది. తగిన పోషకాహారం తీసుకోవడం వలన శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల తర్వాత బరువు తగ్గకుండా ఉండేందుకు మరియు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది
కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అమిత్ జోత్వాని ఈ కార్యక్రమంపై మాట్లాడుతూ, “క్యాన్సర్ చికిత్స కేవలం వ్యాధిని నయం చేయడం మాత్రమే కాదు; రోగులు త్వరగా కోలుకోవడం, వారి శక్తిని తిరిగి పొందడం ఎంతో ముఖ్యం. పోషకాహారం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్’ ద్వారా మేము రోగుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నాము.” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి (కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్), డాక్టర్ సరిత శ్రీవాస్తవ (మెడికల్ & హీమటో ఆంకాలజిస్ట్), డాక్టర్ ప్రవీణ్,డాక్టర్ శ్రీరామ్,డాక్టర్ రఘుకాంత్ (పల్మనాలజిస్ట్),డాక్టర్ శ్రీలత (న్యూట్రిషనిస్టు & డైటీషియన్) మరియు సెంటర్ హెడ్ సువంకర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







