'మిస్టర్ ఎక్స్' యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

- February 25, 2025 , by Maagulf

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మోఎస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మిస్టర్ ఎక్స్. ఎఫ్ఐఆర్ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ భారతదేశ సీక్రెట్ సర్వీస్ లోని హీరోల జీవితాల గురించి ఇంటెన్స్ యాక్షన్-ప్యాక్డ్ కథనాన్ని అందిస్తుంది. మంజు వారియర్ వాయిస్ ఓవర్ మిస్ అయిన న్యుక్లియర్ డివైజ్ గురించి తెలియజేస్తుంది,“మనం దానిని భద్రపరచకపోతే, ఏ క్షణంలోనైనా ఎక్కడైనా ఎటాక్  జరగవచ్చు” అని ఆమె చెప్పడం ఉత్కంఠతని పెంచింది.

ఆ డివైజ్ ట్రాక్ చేయడానికి, ఎటాక్ ని ఆపడానికి  ది ఎక్స్ ఫోర్స్ - ఆర్య, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ నేతృత్వంలోని ఎలైట్ గూఢచారుల బృందం తెరపైకి వస్తోంది. అయితే, టీజర్ టీంలో జరిగే ద్రోహాన్ని సూచించడంతో సినిమా డార్క్ సైడ్ ని ప్రజెంట్ చేస్తోంది.

ఇందులో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివ్యాంక ఆనంద్ శంకర్ , రామ్ హెచ్ పుత్రన్ స్క్రీన్ ప్లే రాశారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, దిబు నినాన్ థామస్ అందించిన BGM కథనాన్ని ఎలివేట్ చేసి టెన్షన్‌ని పెంచుతుంది. ఎడిటింగ్ ప్రసన్న జికె. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి.

Mr X తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా చిత్రంగా విడుదల కానుంది.

తారాగణం: ఆర్య, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మను ఆనంద్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సంగీతం: ధిబు నినన్ థామస్
డీవోపీ: తన్వీర్ మీర్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్
ఆర్ట్: ఇందులాల్ కవీద్
పీఆర్వో: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com