రమదాన్ కార్ రెంటల్స్‌లో 35% పెరుగుదల..SUVలకు డిమాండ్..!!
- February 27, 2025
యూఏఈ: కొన్ని కార్ల లీజింగ్ కంపెనీలు రమదాన్ సందర్భంగా అద్దెలు 35 శాతం వరకు పెంచాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. SUVల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల నుండి అధికంగా డిమాండ్ ఉందని తెలిపారు. కార్ రెంటల్, సబ్స్క్రిప్షన్ సర్వీస్ కంపెనీ సెల్ఫ్‌డ్రైవ్ మొబిలిటీ యాప్ ఆధారిత బుకింగ్‌లలో 30 నుండి 35 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. "రమదాన్ సందర్భంగా, ప్రత్యేకించి SUVల కోసం రిజర్వేషన్లలో గణనీయమైన పెరుగుదలను మేము గమనించాము" అని కంపెనీ సీఈఓ , వ్యవస్థాపకుడు సోహమ్ షా తెలిపారు.
మార్చి 1న ప్రారంభం కానున్న పవిత్ర రమదాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ఈ నెలలో పాఠశాల వేళలను కుదించారు. అనేక ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాల సమయాలను తగ్గించారు.
AA అల్ మూసా ఎంటర్‌ప్రైజెస్‌లో కార్ రెంటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ సింగ్ ప్రకారం.. రమదాన్ మొదటి వారం చివరి నాటికి, డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందన్నారు. ఈద్ అల్ ఫితర్కి దారితీసే చివరి రోజులలో దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పెద్ద వాహనాలు, ముఖ్యంగా SUVలకు అధిక డిమాండ్ ఉంటుందని, ఎందుకంటే కుటుంబాలు సాయంత్రం విహారయాత్రల కోసం విశాలమైన, సౌకర్యవంతమైన సవారీలను ఇష్టపడతాయని తెలిపారు. ప్రస్తుతం, చైనీస్ బ్రాండ్లు యూఏఈ రెంటల్ మార్కెట్లో దాదాపు 20 శాతాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ వాటా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







