చిక్కుకున్న కార్మికుల పై సన్నగిల్లుతున్న ఆశలు

- February 28, 2025 , by Maagulf
చిక్కుకున్న కార్మికుల పై సన్నగిల్లుతున్న ఆశలు

హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగామార్గంలో పరిస్థి తులు సంక్లిష్టంగా మారుతున్నాయి 48 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతున్నా చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదు, నిమిషానికి 5వేల లీటర్ల సీపేజ్‌ నీటి తోడకంతో పాటు బురద పేరుకుపో తుండడంతో రెస్క్యూ పనులు క్లిష్టంగా సాగుతు న్నాయి. 

పైకప్పు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు వెళ్లాయి. ఘటనా స్థలంలో బండరాళ్లు, బురద, నీళ్లు ఉన్నాయి. వందల మీటర్ల వరకు ఉన్న మట్టిని తవ్వ డానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టా  యి. SLBC టన్నెల్‌లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. ఓవైపు డీ వాట‌రింగ్ చేస్తూ, మరోవైపు బురదను లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. 

TBM మిషన్ సమీపంలో పడి ఉన్న సామగ్రిని కూడా తరలిస్తున్నారు. బురద తీశాక పరిస్థితిని అంచనా వేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకు  రావడం ఎలా అనేదానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా  మని అధికారులు చెప్తు న్నారు. రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. 

సంఘటనా స్థలంలో శిథిలాలను తొలగించడానికి అవసరమైన యంత్రాలతో పాటు మెటల్ కటింగ్ నిపుణుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే నియమిం చింది. సికింద్రాబాద్, లాల్లగూడ, రాయనపాడు వర్క్‌షాప్‌ల నుంచి సీనియర్ సెక్షన్ ఇంజనీర్, 13 మంది వెల్డర్లు, ఇద్దరు టెక్నీషియన్లు సంఘటన స్థలానికి చేరుకుని అవసరమైన పనులను చేపట్టారు. 

దక్షిణ మధ్య రైల్వే టీం ప్రస్తుతం శిథిలాల తొల గింపు సహా కార్మికులను రక్షించడం, ఉపశమనం అందించడం వంటి కార్యక లాపాలను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముమ్మరంగా సహాయక చర్యలు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. 

వీరి కోసం ఒకవైపు సైన్యం, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, బీఆర్‌వో, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎల్‌అండ్‌టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నా వారి దగ్గరికి చేరుకోవడానికి అడుగడుగున అడ్డంకులు వస్తున్నాయి. 

టన్నెల్‌లో ప్రతి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతుండటం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేట వేసి ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కార్మికుల క్షేమంపై రోజురోజుకూ ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించా లని శతవిధాలా ప్రయ త్నాలు కొనసాగిస్తు న్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com