ఆ మాటతో తెగ ట్రోల్ అవుతున్న మంచు విష్ణు

- March 01, 2025 , by Maagulf
ఆ మాటతో తెగ ట్రోల్ అవుతున్న మంచు విష్ణు

సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు తదితర భారీ తారాగణం నటిస్తుండటంతో దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా మంచు విష్ణు సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు. ఇందులో తన సినిమా, వ్యక్తిగత జీవితం, కుటుంబ వివాదాలపై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.మంచు ఫ్యామిలీలో ఫైటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. మంచు ఫ్యామిలీ అంతా ఓ వైపు మనోజ్ ఒకవైపు అయ్యారు. ఇప్పటికే ఒకరికి పోటీగా ఒకరు బౌన్సర్లను దింపడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.అలాగే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జనరేటర్ లో పంచదార
మనోజ్ ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార పోయడం అనేది ఓ హైలైట్ మంచు విష్ణు తన ఇంటి జనరేటర్ లో పంచదార పోశారు అని మనోజ్ ఆరోపించారు. ఓ అభిమాని మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ప్రశ్నించాడు. మాకు కూడా సమాధానం చెప్పేంత మంచి మనసు నీది. ఆరోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావు అన్నా? అని ప్రశ్నించగా ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివానని విష్ణు సమాధానం ఇచ్చారు. 

కన్నప్ప మూవీ
ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తుంది. ఇక ఇటీవలే ఈ మూవీ విడుదలైన సాంగ్ సినిమా పై అంచనాలు పెంచేసింది. . ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు మంచు విష్ణు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు పవన్ కళ్యాణ్ గెస్ట్ 
తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు మంచు విష్ణు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కన్నప్ప సినిమాను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చారు. అలాగే  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా పిలుస్తారా అని ప్రశ్నించగా తప్పకుండా ఆయన్ను అడుగుతాం అని మంచు విష్ణు అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com