ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసిన "మామ్ అండ్ మీ"..!!

- March 01, 2025 , by Maagulf
ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసిన \

మనామా: భావన్స్ బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ వార్షిక "మామ్ అండ్ మీ" ఈవెంట్‌ తల్లి,పిల్లల మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో BIS కమ్యూనిటీ పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.  తమ సృజనాత్మకత, శైలిని ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్‌లో మదర్స్ పాల్గొన్నారు. ఆ తర్వాత సరదా గేమ్‌లను ఆడి సందడి చేశారు.  ఈ సందర్భంగా ఉత్తమ పేరెంట్, చిల్డ్రన్ జంటలకు బహుమతులు అందజేశారు. 

BIS ప్రిన్సిపాల్ సాజీ జాకబ్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి, తల్లిదండ్రులు - పిల్లలు కలిసి అర్ధవంతమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి ఒక వేదికను అందించిందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు.  బిఐఎస్ డైరెక్టర్లు రీతూ వర్మ, హిమాన్షు వర్మ మాట్లాడుతూ.. “తల్లులు, వారి పిల్లల మధ్య అమూల్యమైన బంధాన్ని జరుపుకోవడానికి ‘మామ్ అండ్ మి’ ఈవెంట్ మాకు ఒక అద్భుతమైన అవకాశం. మన సమాజంలో ప్రేమ, అనుబంధం, ఆనందాన్ని పెంపొందించే ఇలాంటి క్షణాలను సృష్టించడం చాలా అవసరం.’ అని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com