జైలు సందర్శన సమయాల ప్రకటన
- July 03, 2016
పోలీస్ శాఖకు చెందిన ప్యునిటివ్ మరియు కరెక్షనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిపార్ట్మెంట్, జైల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు ఖైదీల కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక 'టైమింగ్స్'ని ప్రకటించింది. అన్ని దేశాలకు చెందిన పురుష ఖైదీలను పరామర్శించేందుకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తారు, అదే మహిళా ఖైదీలకు అయితే ఈ సమయం మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఒకటో నంబర్ బిల్డింగ్లో ఈ అవకాశం కల్పిస్తారు. తొలి రోజు టైమింగ్స్ ఇలా ఉంటే, రెండో రోజు రెండో నెంబర్ భవనంలో అవకాశం కల్పిస్తారు. సమయం తొలి రోజు టైమింగ్స్లానే ఉంటాయి. మిస్డెమీనస్ మరియు వయొలేషన్స్ ప్రిజన్, విమెన్స్ ప్రిజన్, జువైనల్ సెక్షన్, అరబ్ మరియు ఎమిరేటీ మేల్ విజిటర్స్ 8 నుంచి 11 గంటల వరకు (ఉదయం) తొలి రోజు, అరబ్ మరియు ఎమిరేటీ ఫిమేల్ విజిటర్స్ 2.30 నుంచి 5 గంటలు (మధ్యాహ్నం) వరకు ఈద్ మొదటి రోజు సందర్శించవచ్చు. రెండో రోజు కూడా ఇవే సమయాలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







