యూఏఈలో 95శాతానికి ఒబెసిటీ రేట్లు..ప్రపంచంలోనే అత్యధికం..!!
- March 04, 2025
యూఏఈ: యూఏఈలో ఒబెసిటీ పెరిగిపోతుంది. రాబోయే రెండున్నర దశాబ్దాలలో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. లాన్సెట్ అధ్యయనం ప్రకారం.. యూఏఈలో 25 ఏళ్లు పైబడిన వయోజన పురుషులలో అధిక బరువు, ఒబెసిటీ 2021లో 84 శాతం నుండి 2050లో 94 శాతానికి పెరుగుతుంది. ఇది కువైట్ , కొన్ని ఇతర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికం అని తెలిపింది. అదేవిధంగా, యూఏఈ మహిళల్లో అధిక బరువు, ఒబెసిటీ 2050లో 95 శాతానికి పెరుగుతుందని.. ఈజిప్ట్, టోంగా, కువైట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని నాల్గవ స్థానానికి చేర్చుతుందని పేర్కొంది.
యూఏఈలోనే కాదు, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాలలో 25 ఏళ్లు పైబడిన నివాసితులలో అధిక బరువు, ఒబెసిటీ రేట్లు 90 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. 15 - 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో ఒబెసిటీ, అధిక బరువు ఉన్నవారి జనాభా 2021లో 62 శాతం నుండి 2050 నాటికి 81 శాతానికి పెరుగుతుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉంటుందని తెలిపింది.
ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం, స్క్రీన్‌పై అధిక సమయం గడపడం, నివాసితులు శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక స్థాయిలో ఒబెసిటీ పెరగడానికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ జెస్సికా కెర్ మాట్లాడుతూ.. ఊబకాయాన్ని నివారించడం అన్ని ప్రభుత్వ విధానాలలో ముందంజలో ఉండాలని సూచించారు. షార్జాలోని ఆస్టర్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ జనరల్ , లాపరోస్కోపిక్ సర్జరీ డాక్టర్ తస్నీమ్ మొహమ్మద్ నూర్ అబు ఎల్ ఫౌల్ మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా శారీరక శ్రమ చేయాలని సూచించారు. సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలి వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా ఒబెసిటీకి దూరంగా ఉండవచ్చని డాక్టర్ తస్నీమ్ అన్నారు. ప్యూర్ హెల్త్ గ్రూప్ సీఈఓ షైస్తా ఆసిఫ్ మాట్లాడుతూ.. యూఏఈ తన జనాభా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి చురుకైన, నివారణ విధానంతో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
ఇటీవలి తరాలు మునుపటి తరాల కంటే వేగంగా బరువు పెరుగుతున్నాయని, ఒబెసిటీ ముందుగానే సంభవిస్తుందని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, చిన్న వయస్సులోనే క్యాన్సర్ల వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది. అధిక ఆదాయ దేశాలలో 1960లలో జన్మించిన పురుషులలో దాదాపు 7 శాతం మంది 25 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఒబెసిటీతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఇది 1990లలో జన్మించిన పురుషులలో దాదాపు 16 శాతానికి పెరిగిందని, 2015లో జన్మించిన పురుషులలో 25 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రపంచ యువ జనాభాలో దాదాపు సగం మంది.. ఒక బిలియన్ పురుషులు, 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1.11 బిలియన్ మహిళలు 2021లో అధిక బరువు లేదా ఊబకాయంతో జీవిస్తున్నారని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







