విద్యుత్ సబ్సిడీల రెట్టింపునకు ఎంపీల ఒత్తిడి..EWA హెచ్చరిక..!!

- March 09, 2025 , by Maagulf
విద్యుత్ సబ్సిడీల రెట్టింపునకు ఎంపీల ఒత్తిడి..EWA హెచ్చరిక..!!

మనామా: పెద్ద గృహాలకు సబ్సిడీ విద్యుత్ కోటాలను రెట్టింపు చేయడం వల్ల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని విద్యుత్, నీటి అథారిటీ (EWA) హెచ్చరించింది. సబ్సిడీలు ఇప్పటికే ఏటా BHD 217 మిలియన్లు ఖర్చు చేస్తున్నాయి. పార్లమెంట్ మంగళవారం ఈ ప్రతిపాదనపై చర్చించనుంది. ప్రైవేట్ సంస్థల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేసి తక్కువ ధరలకు విక్రయిస్తున్నామని, సబ్సిడీలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, మళ్లీ సబ్సిడీలతో ఖర్చులు పెరుగుతాయని EWA ఆందోళన వ్యక్తం చేసింది. గృహ విద్యుత్ రేట్లు మారకపోవడంతో పెరుగుతున్న గ్యాస్ ధరలు ఇబ్బందిగా మారుతున్నాయని పేర్కొంది.

ఎంపీలు మొహమ్మద్ మొహమ్మద్ అల్ రిఫాయ్, హిషామ్ అబ్దులాజీజ్ అల్ అవధి, జలీలా అలావి, అహ్మద్ ఖరాటా, అబ్దుల్‌నబి సల్మాన్ సమర్పించిన ఈ ప్రతిపాదన.. ఖాతాదారుడి ఫస్ట్-డిగ్రీ బంధువులకు అదనపు సబ్సిడీ కోటాలను కోరుతోంది. ఇది ఇంటికి మూడు కుటుంబాల వరకు ఉంటుంది. ఆమోదం పొందితే, చౌకైన రేటు రెండు కుటుంబాలకు 3,000 నుండి 6,000 యూనిట్లకు, ముగ్గురికి 9,000 యూనిట్లకు రెట్టింపు అవుతుందని తెలిపారు.  అయితే, పబ్లిక్ యుటిలిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. పార్లమెంటు ఆమోదం కోసం సిఫార్సు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com